
కార్పొరేషన్ లో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల టౌన్ ( గోల్కొండ) మున్సిపల్ కార్పోరేషన్ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను శుక్రవారం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు విడుదల చేశారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్ అభ్యర్థుల పేర్లను మీడియా సమావేశంలో ప్రకటించారు. ఎన్నికల్లో ఓట్ల శాతం పెంచాలని కోరారు. రెండేళ్లలో చేసిన అభివృద్ధి పనులు కాంగ్రెస్ కు పట్టంకడతాయని అన్నారు. కార్పొరేషన్ ను కాంగ్రెస్ వశం చేసుకుని పాలక మండలితో మరింత అభివృద్ధి లోకి తీసుకువెళ్తామని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకువస్థానని భరోసా ఇచ్చారు. రెండు వేల పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయడం తన లక్ష్యమని అన్నారు. విద్య, వైద్యం కోసం ఎవరు కూడా ఇతర ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి రాదని వివరించారు. గుడిపేటలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద చేప పిల్లల పెంపకం కేంద్రం జాతీయ స్థాయిలో అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.


