
ఐదు ఎకరాలపైన భూమి ఉన్న రైతులు ఆయిల్ ఫాం సాగు చేయాలి
హుస్నాబాద్ ఏప్రిల్ 12 (గోల్కొండ ):ఐదు ఎకరాల పైన భూమి ఉన్న రైతులు ఆయిల్ ఫాం సాగు చేయాలని నేను కూడా ఆయిల్ ఫాం సాగు చేస్తానాని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు .చిన్న గ్రామాల్లో 50 ఎకరాలు ,పెద్ద గ్రామాల్లో 100 ఎకరాలు ఆయిల్ ఫామ్ సాగు చేయాలి.. ఆయిల్ ఫాం సాగు వల ప్రకృతి ఇబ్బందులు ,కోతుల ఇబ్బందులు ఉండవన్నారు.దానిపై నర్మేట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ విజిట్ చేయాలని అన్నారు.సాగు నీరు కాలువలు పూర్తయ్యేలా చేస్తున్నాంమని ఇటీవల గౌరవెల్లి ప్రాజెక్ట్ పై సమావేశం జరిగింది.. త్వరలోనే కాలువల పనులు పూర్తి చేస్తామని తెలిపారు.త్వరలోనే పేమెంట్ పూర్తి చేస్తాం.. అందరూ కాలువకు భూమి ఇవ్వాలని కోరారు.కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆలస్యం చేయకుండా వెంటవెంటనే ఇస్తున్నామని,రేకొండ భూసమస్య పై ముఖ్యమంత్రి కలుస్తానని అన్నారు.
హుస్నాబాద్ నియోజకవర్గం చిగురు మామిడి మండల కేంద్రంలో ఉన్నత పాఠశాల ప్రాంగణంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు.
ప్రభుత్వం అధునాతన సౌకర్యాలతో 4 ఎకరాల విస్తీర్ణంలో 1-12 తరగతి వరకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ లను ఏర్పాటు చేస్తుందన్నారు.పాఠశాల ప్రాంగణంలోనే ప్రైమరీ, హైస్కూల్, జూనియర్ కాలేజీ ఉండేలా చర్యలు చెపట్టనున్నట్లు తెలిపారు.తెలంగాణ పబ్లిక్ స్కూల్ స్థలం పై అధికారులకు పలు సూచనలను మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.అనంతరం చిగురు మామిడి రైతు వేదిక వద్ద వ్యవసాయ యాంత్రీకరణ పథకం 2025-26 SMAM రాయితీ పై వ్యవసాయ పనిముట్లు,యంత్రాలకు రైతులకు పంపిణీ చేశారు.24 మంది రైతులకు 40.80 లక్షల రూపాయల విలువైన అధునాతన వ్యవసాయ పనిముట్లను అందజేశారు.15 రోటావేటర్లు ,బెయిలర్లు,పవర్ స్ప్రేయర్లు ,తదితర పనిముట్లు పంపిణీచేశారు.అనంతరం లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు..కార్యక్రమంలో పాల్గొన్న అడిషనల్ కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే, సర్పంచ్ ఆకవరం భవానీ, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, ఆర్డీవో మహేష్ ,ఎమ్మార్వో ,ఇతర ముఖ్య నేతలు,సర్పంచ్ లు ,ఉప సర్పంచ్ లు,అధికారులు..
వ్యవసాయ శాఖ తరుపున చాలా సంవత్సరాల తరువాత ప్రజా ప్రభుత్వంలో పనిముట్లు పంపిణీ చేస్తున్నామని ఇంకా ఎవరికైనా అవసరం ఉంటే అప్లికేషన్ ఇవ్వాలి..
గడ్డి మోపులు కట్టే బేయిలర్లు ఎక్కువగా అవసరం ఉన్నాయని చెబుతున్నారు..అవసరాల రీత్యా వాడుకోవాలని అన్నారు.మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాం.. ఎక్కడ ఇబ్బందులు లేవన్నారు.


