ఎన్నికల ప్రచారానికి దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్ శ్రీకారం.

ఎన్నికల ప్రచారానికి దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్ శ్రీకారం.

.ఎమ్మెల్యే ప్రచారానికి బ్రహ్మరథం పట్టిన ప్రజలు

దేవరకద్ర, డిసెంబర్ 7 (గోల్కొండ)

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (జిఎంఆర్) ఆదివారం ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా దేవరకద్ర నియోజకవర్గం పరిధిలోని చిన్నచింతకుంట మండలం బండర్ పల్లి లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి టి. లక్ష్మి తిరుపతి కు మద్దతుగా ఎమ్మెల్యే జీఎంఆర్ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బ్యాట్ గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లక్ష్మీ తిరుపతి కి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!