ఆలయానికి విల్ చైర్స్ పంపిణీ

ఆలయానికి విల్ చైర్స్ పంపిణీ

యాదాద్రి భువనగిరి ఆగస్టు 20 (గోల్కొండ ):
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వైకుంఠ ద్వారం వద్ద ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య బుధవారం వీల్ ఛైర్స్ ని పంపిణీ చేశారు.యాదగిరిగుట్ట స్వామి వారి దర్శనానికి వచ్చే వికలాంగులు,వయో వృద్ధుల దర్శనం కోసం ఉప్పల్ కి చెందిన లైప్ మెడికల్ సిస్టమ్స్ అధినేత ఉషా కిరణ్ గారు ఆలయానికి 10 విల్ ఛైర్స్ ని డోనేట్ చేయడం జరిగింది.ఈ విల్ ఛైర్స్ ని బుధవారం ఎమ్మెల్యే దేవస్థానికి అందజేశారు.
ఎమ్మెల్యే గంధమల్ల చెరువుకు పూజలు చేశారు.
యాదగిరిగుట్ట పట్టణంలో అరుట్ల కమలాదేవి రామచంద్రరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సర్టిఫికెట్స్ పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య ,మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు పాల్గొన్నారు.ముందుగా అరుట్ల కమలాదేవి రామచంద్రరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.టైలరింగ్,ఎంబ్రాయిడరీ,కంప్యూటర్ శిక్షణ ధ్రువపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!