
అహింసతోనే దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహనీయుడు గాంధీ : జిల్లా ఎస్పీ
జగిత్యాల లీగల్ అక్టోబర్ 02 (గోల్కొండ ): మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా గురువారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గాంధీజీ సూచించిన శాంతి, అహింస, సత్యం మార్గంలో ముందుకు సాగాలని గాంధీ సన్మార్గంలో ప్రయాణిస్తూ నమ్మిన సిద్ధాంతాలను విలువలను నిబద్ధతతో ఆచరించడం వల్ల ఆయన కీర్తి ప్రతిష్టలు విశ్వవ్యాప్తం అయ్యాయని అన్నారు. స్వాతంత్రం కోసం గాంధీజి చేసిన సేవలు మరువలేనివి, భారతావనికి స్వేచ్ఛా స్వాతంత్య్రం అందించడం కోసం గాంధీజీ ఎంచుకున్న శాంతి, అహింస మార్గం భారతీయులకే కాదు యావత్ ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచిందిని అన్నారు. దేశ అభివృద్ధి కోసం నిస్వార్థంగా మనమందరం సేవలు అందించాలని ఆయన ఆశయాల సాధనకు మనందరం కృషి చేయాలని తెలిపారు. గాంధీజీ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం అని ఆయన ఆశయాలను కొనసాగించడమే మనo ఆయనకు ఇచ్చే ఘన నివాళి అని కోరారు. ఈ కార్యక్రమంలో SB ఇన్స్పెక్టర్ అరిఫ్ అలీ ఖాన్, RI లు కిరణ్ కుమార్ , సైదులు, RSI లు,జిల్లా పోలీసు కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.


