స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల..

స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల..

 

హైదరాబాద్ సెప్టెంబర్ 29 (గోల్కొండ ):
స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం. మొదట ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగనున్నాయి. ఆ తర్వాత వార్డులు, సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనుంది. అక్టోబర్ 9వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది ఎన్నికల సంఘం. ఆ రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం ఐదు విడతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. అక్టోబర్ 9వ తేదీన ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై నవంబర్ 11వ తేదీన ముగియనుంది.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని మీడియాకు వివరాలు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అనుమతి ఇచ్చిందని తెలిపారు. టైమ్ షెడ్యూల్ ఖరారు చేసుకున్నామని వివరించారు. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఖాళీ వివరాలు గెజిట్ నోటిఫికేషన్ ఆదివారం తమకు అందిందని వెల్లడించారు. ఓటర్ల జాబితాను వార్డు, గ్రామం, ఎంపీటీసీ, జడ్పీటీసీ వారిగా పబ్లిష్ చేశామని తెలిపారు. ఎన్ని అవాంతరాలు వచ్చినా అధికారులు ప్రక్రియ పూర్తి చేశారని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని పేర్కొన్నారు.

 

అక్టోబర్ 9 నుండి ఎలక్షన్ కోడ్

మొదటగా అక్టోబర్ 23, 27న రెండు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు

తర్వాత అక్టోబర్ 31, నవంబర్ 4, 8న మూడు దశల్లో సర్పంచ్ ఎన్నికలు

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!