
శారీరక ధారుఢ్యానికి క్రీడలు దోహదం -బిజెపి దేవరకద్ర నియోజకవర్గ ఇన్చార్జి కొండ ప్రశాంత్ రెడ్డి
-దేవరకద్రలో ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవం
దేవరకద్ర,ఏప్రిల్ 11 ( గోల్కొండ ):ప్రస్తుత సమాజంలో మానసిక ఒత్తిడిని తగ్గించడానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ బిజెపి పార్టీ ఇన్చార్జి కొండ ప్రశాంత్ రెడ్డి అన్నారు. దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో శనివారం ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవం సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొండ ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రతి వ్యక్తి తన నిత్యజీవితంలో ప్రతి రోజు ఒక గంట సమయాన్ని ఏదైనా క్రీడకు కేటాయించాలన్నారు. క్రీడలు శారీరక ధారుఢ్యానికి కూడా తోడ్పడతాయన్నారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి బ్యాటింగ్ చేసి కాసేపు క్రీడాకారులతో సరదాగా గడిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ దేవరకద్ర మండల అధ్యక్షుడు కృష్ణంరాజు, స్థానిక బిజెపి కౌన్సిలర్ ఉమారాజు, ఓబీసీ కన్వీనర్ దేవన్నసాగర్, కొండ వెంకటేశ్వర్ రెడ్డి, స్టేషన్ సత్యనారాయణ, మాజీ జిల్లా కార్యదర్శి నారాయణరెడ్డి, శ్రీశైలం, గణేష్, టీఎం వెంకటేష్, అరవింద్, విద్యాసాగర్, అరుణ్ లతోపాటు ఎంఈఓ బలరాం, స్థానిక బాలుర ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రామలింగం, బాలుర ఉన్నత పాఠశాల పిఈటి అంజనమ్మ, బాలికల ఉన్నత పాఠశాల పి ఈ టి శివ కుమారి, కోయిల్ సాగర్ ఉన్నత పాఠశాల పిఈటి కనకప్ప,డోకూర్ పాఠశాల పిఈటి అన్వర్ పాషా, ఎంపిఓ వెంకట్ రాములు తదిత బిజెపి ముఖ్య నేతలు, నాయకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.


