
యూరియా కోసం రైతులకు తప్పని కష్టాలు…
కరీం పేటలో పోలీసు బందో వస్తు నడుమ యూరియా పంపిణీ చేసిన అధికారులు
తాడికల్లో ఏడిఏ ,ఏవో సమక్షంలో యూరియా పంపిణీ
కరీంనగర్ ఆగస్టు 19 (గోల్కొండ ): కరీంనగర్ జిల్లా శంకరపట్నం వర్షాలు సమృద్ధిగా కురిసాయి రైతులు వరి నాట్లు వేశారు. వేసిన వరి నాట్లకు సకాలంలో యూరియా చల్లడం కోసం రైతులకు కష్టాలు తప్పడం లేదు. తెల్లవారితే యూరియా లోడ్ ఎప్పుడు వస్తుందోనని రైతులు పనులు మానుకొని యూరియా కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
శంకరపట్నం మండలం కరీంపేట లో మంగళవారం సహకార సంఘం పంపిణీ కేంద్రానికి 230 యూరియా బస్తాలు వచ్చాయి. యూరియా కోసం రైతులు భారీగా తరలివచ్చారు. తాడికల్ సహకార సంఘం సీఈవో, ఏఈఓ యూరియా బస్తాల పంపిణీ కి సిద్ధమవుగా ఒక్కసారిగా రైతులు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు అక్కడికి చేరుకొని రైతులను సముదాయించి నిర్వాహకులతో కలిసి రైతుల వద్ద ఆధార్ కార్డులు తీసుకొని ఒక్కో రైతుకు ఒక్కో బస్తా చొప్పున పంపిణీ చేశారు. తాడికల్ కు 450 యూరియా బస్తాలు రాగా ఏడిఏ శ్రీధర్ , ఏవో వెంకటేష్ పర్యవేక్షణలో రైతులకు యూరియా పంపిణీ చేశారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనె యూరియా కొరత లేకుండా చుడాలని రైతులు కోరుతున్నారు .


