యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓట్ చోరీ నిరహారదీక్షకు సంఘీభావం తెలిపిన  ప్రణవ్.

యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓట్ చోరీ నిరహారదీక్షకు సంఘీభావం తెలిపిన ప్రణవ్.

దేశంలో ఓట్ చోరీ జరిగిందనీ రాహుల్ గాంధీ నిరూపించారు.
ప్రధాన కూడలిలో ఓటు చోరీ నిరసన ద్వారా ప్రజలకు మరింత అవగాహన.

కరీంనగర్ఆ,గస్టు 25 (గోల్కొండ ):కరీంనగర్ పట్టణంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్యామ్ సుందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓట్ చోరీ నిరహారదీక్షలో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు.పార్లమెంట్ సాక్షిగా రాహుల్ గాంధీ ఓట్ చోరీ పై ఆధారాలతో నిరూపించారని,దీనిపట్ల ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరారు.ప్రధాన చౌరస్తాలో ఇలాంటి దీక్షల వల్ల ప్రజలకు ఓట్ చోరీ పై మరింత అవగాహన పెరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!