
మాజీ మంత్రి కన్నుమూత ….దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్య మంత్రి
హైదరాబాద్ అక్టోబర్ 02 (గోల్కొండ ):
మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి (73 )కన్నుమూశారు .కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.దామోదర్ రెడ్డి 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు.తుంగతుర్తి ,సూర్యాపేట నియోజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహించారు.
మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి మరణించారని తెలిసి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయిదు సార్లు శాసనసభ సభ్యుడిగా దామోదర్ రెడ్డి నిరంతరం ప్రజల మధ్యన ఉంటూ జిల్లా అభివృద్ధి కోసం ఎనలేని సేవలు అందించారని గుర్తుచేసుకున్నారు.
TAGS Hot News


