
మహాత్మా జ్యోతి రావు పూలే గొప్ప మహానీయుడు…
-జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయ కర్త లయన్ అశ్విని చంద్రశేఖర్
దేవరకద్ర, ఏప్రిల్ 11 (గోల్కొండ):
ప్రముఖ సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతి రావు పూలే గొప్ప మహానీయుడని
జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయ కర్త లయన్ అశ్విని చంద్రశేర్ అన్నారు.
జ్యోతిబా ఫూలే జయంతి సందర్భంగా శనివారం మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం లక్ష్మీ పల్లి ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ఆవరణలో ఏర్పాటు చేసిన ఫూలే చిత్రపటానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయ కర్త అశ్విని చంద్రశేఖర్ మాట్లాడుతూ నేటి యువతరం ఫూలే ఆలోచనలు, ఆశయాలు తెలుసుకొని పాటించాల్సిన అవసరం ఉందని అన్నారు.చదువు ప్రాముఖ్యతను అనేక మందికి తెలియజేస్తూ ఎంతో మందిని ఉన్నతమైన మార్గంలో వెళ్లేందుకు దారి చూపిన గొప్ప విద్యావేత్త పూలే అన్నారు.ఆయన ఆశయ సాధన కు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల హెచ్ యం ఎస్. కల్పన, ఉన్నత పాఠశాల ఇంచార్జి హెచ్ యం శ్రీనివాస్ రావు, ఉపాధ్యాయులు మురళీ ధర్, దోమ శంకర్, టి. నాగేశ్వర్ రెడ్ది, మదన్ మోహన్, బిజిలి విజయ లక్ష్మీ, కావలి సుజాత, వెంకట్రాము లు తదితరులు పాల్గొన్నారు.


