బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పిటిషన్…

బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పిటిషన్…

ఢిల్లీ అక్టోబర్ 04 (గోల్కొండ ) : తెలంగాణ రాష్ట్రంలోని బీసీ రిజర్వేషన్ల అంశం రోజుకో మలుపు తీసుకుంటుంది. ఇప్పుడు తాజాగా రిజర్వేషన్ల అంశం సుప్రీకోర్టుకు చేరింది. 42 శాతం బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. తెలంగాణలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయబోతున్నారని వంగ గోపాల్ రెడ్డి పిటిషన్ సుప్రీంకోర్టులో వేశారు.
50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేస్తున్నారంటూ.. పిటిషన్‌లో చెప్పుకొచ్చారు. గతంలో సుప్రీంకోర్టు 50 శాతం రిజర్వేషన్ మించరదంటూ ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా.. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఉన్నాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో గోపాల్ రెడ్డి వేసిన పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. జస్టిస్ విక్రమ్ నాథ్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగనున్నట్లు సమాచారం.
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు గత ప్రభుత్వం తీసుకొచ్చిన రిజర్వేషన్లను ఎత్తివేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం తెలిపింది. దీనికి అన్ని పార్టీల నేతలు అంగీకారం తెలిపారు. ఆ తర్వాత వీటిని గవర్నర్ ఆమోదం కోసం రాజ్ భవన్‌కు పంపారు. అయితే ఈ బిల్లుకు గవర్నర్ ఇంకా ఆమోదం తెలుపలేదు.రిజర్వేషన్ల బిల్లుపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. తమ వద్దనే పెండింగ్‌లోనే ఉన్నాయని ఇటివల రాజ్ భవన్‌ వర్గాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీ బిల్లుపై సుప్రీంకోర్టులో పిటిషన్ పడటం రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ అని చెప్పవచ్చు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఏ తీర్పు ఇస్తోంది అనే దానిపై సర్వాత్ర ఉత్కంఠ నెలకొంది.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!