పార్లమెంట్‌లో ఆమోదం పొందిన అమరావతి బిల్లు…

పార్లమెంట్‌లో ఆమోదం పొందిన అమరావతి బిల్లు…

న్యూఢిల్లీ ఏప్రిల్ 02 (గోల్కొండ):
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. ఈ అమరావతి బిల్లుకు ఉభయ సభలు ఏకగ్రీవ ఆమోదం తెలిపాయి. అనంతరం ఈ బిల్లును కేంద్రం.. రాష్ట్రపతికి పంపనుంది. ఈ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేసిన తర్వాత గెజిట్‌ నోటిఫికేషన్ విడుదలకానుంది. దీంతో ఏపీ ఏకైక రాజధానిగా అమరావతి అమల్లోకి రానుంది. ఈ బిల్లు ఆమోదం పొందడంతో.. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాజ్యసభ చైర్మన్ సి.పి.రాధాకృష్ణన్ శుభాకాంక్షలు తెలియజేశారు. పార్లమెంట్‌ ఉభయ సభల్లో ఈ బిల్లు పాస్‌ కావడంతో రాజధాని అమరావతిలో సంబరాలు మిన్నంటాయి.
రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీఎంసీ, ఆప్, బీజేడీ, ఆర్జేడీ, బీఆర్ఎస్, జేడీ(యూ), శివసేన మద్దతు ఇచ్చాయి. రాజ్యసభలో అమరావతి చట్టబద్ధతపై జరిగిన చర్చలో 11 పార్టీలు పాల్గొన్నాయి. 17 మంది సభ్యులు చర్చలో పాల్గొన్నారు. అయితే రాజ్యసభలో సైతం ఈ బిల్లును వైసీపీ వ్యతిరేకించింది.అమరావతి బిల్లు ఆమోదంతో రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులు చురుగ్గా కొనసాగే అవకాశం ఉంది .పెట్టుబడిదారులకు స్పష్టత వచ్చి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారని రాజధాని ప్రాంత రైతులు వాపోతున్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!