
నేపాల్ ప్రధాని ఓలి రాజీనామా….నేపాల్ పార్లమెంట్ భవనానికి నిప్పు
ఖాట్మండ్ సెప్టెంబర్ 09 (గోల్కొండ ):
సైన్యం సూచనతో నేపాల్ ప్రధాని కే పీ శర్మ ఓలి ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు. కొంచెం సేపటి క్రితమే ఆయన తన రాజీనామా సమర్పించారు.
నేపాల్‌లో జెన్ జెడ్ యువత ఆధ్వర్యంలో జరిగిన నిరసన ప్రదర్శనలు దేశ రాజకీయాలను తలకిందులు చేశాయి. సోషల్ మీడియా ఆంక్షలు, అవినీతి ఆరోపణలు, ప్రభుత్వ విధానాలపై అసంతృప్తి పెరిగిన నేపథ్యంలో ప్రధాని ఓలి అధికారం నుంచి తప్పుకోకతప్పలేదు.నేపాల్ పార్లమెంట్ భవనానికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు ఆ భవనం నుంచి పెద్ద ఎత్తున మంటలు పొగలు బయటకు వస్తున్నాయి సోషల్ మీడియా పై నిషేధాన్ని ఎత్తివేసిన అక్కడ హింసాత్మక ఘటనలు ఆగడం లేదు .అత్యవసర సమావేశం తర్వాత నూతన ప్రధాని పై నిర్ణయం తీసుకోనున్నారు.నేపాల్ రాజకీయం ఉత్కంఠ భరితంగా మారింది. దేశంలో రాజకీయ సంక్షోభం తీవ్రమవుతున్న వేళ, ప్రధాని కేపీ శర్మ ఓలీ అనూహ్యంగా దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.దేశంలో రెండో రోజూ ఆందోళనలు ముదురుతున్న నేపథ్యంలో, ఓలీ విమానాన్ని సిద్ధం చేసుకుని, రాజకీయ అనిశ్చితి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజల ఆగ్రహం, విపక్షాల నిరసనల మధ్య నేపాల్ రాజకీయాలు గందరగోళంగా మారాయి. దీంతో ఈ సంక్షోభం ఎటువైపు దారితీస్తుందనే ఉత్కంఠ నెలకొంది. ఓలీ నిర్ణయం దేశ భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తుందనేది ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది.
.యువత ఆందోళనతో సోషల్ మీడియా ఆంక్షలు ఎత్తివేశారు .ఇటు మంత్రులు రాజీనామా చేశారు.


