
దేశ భద్రతను కాంగ్రెస్ పణంగా పెడుతుంది ….ఎంపీ ఈటల రాజేందర్

ఓట్లకోసం, అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ దేశభద్రతనే పణంగా పెడుతుందని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.
ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో విలేకర్లతో మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రంలో గెలిచింది కాంగ్రెస్ పార్టీ నే కదా..ఇక్కడ కూడా ఈవీఎం మిషన్లతోనే ఎన్నికలు జరిగాయి కదా..మీరు గెలిస్తే మిషన్లు పని చేసినట్టు ఎలక్షన్ కమిషన్ పనిచేసినట్టు..ఓడిపోతే ఎలక్షన్ కమిషన్ పనిచేయనట్లు, ఓట్ల చోరీ జరిగినట్లు దుష్ప్రచారం చేస్తున్నారు ఇదెక్కడి దిక్కుమాలిన ఆలోచన. అని మండి పడ్డారు.
ఉదాహరణకు హైదరాబాదులో అద్దెకు ఉండేవాళ్లు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మారుతూ ఉంటారు.. ఊరు నుంచి పట్టణాలకి వలస వస్తూ ఉంటారు.. వీరి ఓట్లను సరి చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ మీద ఉంటుంది కదా.
ఓట్ల నమోదు, డబుల్ ఓట్లను తొలగించే విధానం నిరంతర ప్రక్రియ.
బీహార్ బోర్డర్ ఉన్న ప్రాంతం. ఇక్కడికి బంగ్లాదేశ్ ఇతర ప్రాంతాల నుండి వచ్చే అవకాశం ఉంది. అలా వచ్చిన వారికి ఆధార్ కార్డులు సిటిజన్షిప్ ఇవ్వటం ఎంత మాత్రం దేశానికి క్షేమం కాదు. ఓట్ల కోసం అధికారం కోసం దేశ భద్రతనే పణంగా పెడతా అంటే మంచి పద్ధతి కాదు. ఇలాంటి చవకబారు ఆరోపణలు సరికాదు. ఎన్నికల కమిషన్ స్వతంత్ర సంస్థ.
సుప్రీంకోర్టు కూడా కొన్ని ఆదేశాలు జారీ చేసింది దాని ప్రకారం నిర్ణయాలు ఉంటాయి తప్ప దానికి పార్టీకి, ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంటుంది.. ఆ మాత్రం అవగాహన లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. వీరి వెంట బీజేపీ నాయకులూ ఉన్నారు.


