దసరా పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి: జిల్లా ఎస్పీ

దసరా పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి: జిల్లా ఎస్పీ

జగిత్యాల లీగల్ అక్టోబర్ 02 (గోల్కొండ ):
దసరా పండుగ ను జిల్లా ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా భద్రత పరమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుందని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. గురువార జిల్లా కేంద్రంలో జమ్మి చెట్టు పూజా, నరకాసుర వధ జరేగే జంబిగద్దె, కోరుట్ల , మెట్ పల్లి ప్రాంతాలను పరిశిలించి భద్రత పరంగా చేయవల్సిన ఏర్పాట్ల గురించి అధికారులకి సూచనలు చేశారు. ఈ సందర్భంగా చట్టాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని, చట్టానికి లోబడి నడుచుకోవాలని, చట్టానికి విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. దసరా పండుగను, దుర్గ నిమజ్జన ను శాంతియుతంగా, సామరస్యంగా జరుపుకోవాలని అందుకు ప్రజలు పూర్తిగా పోలీసు వారికి సహకారం అందించాలని కోరారు. వీరి వెంట డీఎస్పీలు రఘు చందర్, రాములు, SB ఇన్స్పెక్టర్ అరిఫ్ అలీ ఖాన్, టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్, కోరుట్ల, మెట్ పల్లి సి.ఐలు సురేష్ , అనిల్ కుమార్ ఎస్.ఐ లు ఉన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!