జగ్గాసాగర్ లో ఘనంగా కార్తీక దీపోత్సవం కార్యక్రమం…

జగ్గాసాగర్ లో ఘనంగా కార్తీక దీపోత్సవం కార్యక్రమం…

11వేల దీపాలను వెలిగించిన మహిళలు
మెట్ పల్లి, నవంబర్ 3 (గోల్కొండ):
మెట్ పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామంలో సోమవారం సాయంత్రం స్థానిక శ్రీ సీతారామాంజనేయ దేవాలయంలో కార్తీక మాస దీపోత్సవం ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని 11వెల దీపాలను వెలిగించారు. ఇట్టి దీపాలను శివలింగం, త్రిశూలం, ఓం, స్వస్తిక్, శంకు చక్రాలతో కూడిన విష్ణు నామం జై శ్రీరామ అనురూపాలలో అందంగా అలంకరించారు. దీపాల అలంకరణతో ఆలయ ప్రాంగణమంతా కాంతివంతంగా మారింది. మహిళలు, కమిటీ సభ్యులంతా కలిసి భజన కార్యక్రమాలు నిర్వహించారు. అంతకుముందు కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ఆరంభించారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!