ఘనంగా నందమూరి హరికృష్ణ జయంతి వేడుకలు

ఘనంగా నందమూరి హరికృష్ణ జయంతి వేడుకలు

విజయవాడ సెప్టెంబర్ 02 (గోల్కొండ ): మాజీ ఎంపీ చైతన్య రథసారథి,  స్వర్గీయ నందమూరి హరికృష్ణ 69వ జయంతి వేడుకలు కృష్ణ జిల్లా స్వగ్రామం, నిమ్మకూరులో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి నందమూరి సుహాసిని ,నందమూరి రామకృష్ణ రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర హాజరయ్యారు.ఈ సందర్భంగా అభిమానులు టీడీపీ నాయకులూ కేకు కట్ చేశారు.అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.పలువురు అభిమానులు రక్త దానం చేయగా వారికీ ప్రశంశ పత్రాలు, మెమొంటోలు అందించారు. వారు మాట్లాడుతూ హరికృష్ణ టీడీపీ పార్టీకి రాష్ట్రానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు . అనంతరం అన్నదానం చేశారు.ఈ కార్యక్రమంలో హరికృష్ణ అభిమానులు ,టీడీపీ నాయకులూ కార్యకర్తలు పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!