ఘనంగా  కొమ్మిడి రాకేష్ రెడ్డి జన్మదిన వేడుకలు

ఘనంగా కొమ్మిడి రాకేష్ రెడ్డి జన్మదిన వేడుకలు

వీణవంక,అక్టోబర్ 21(గోల్కొండ):
మండలం లోని నర్సింగాపూర్ గ్రామానికి చెందిన అతిధి డేవలపర్స్ అధినేత కొమ్మిడి రాకేష్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు మంగళవారం వారి నివాసంలో కుటుంబ సభ్యులు,వారి అభిమాను ల మధ్య ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు.మండలం లోని మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, ఆయన అభిమానులు శాలువాలు కప్పి,పుష్ప గుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన అభిమానులు మాట్లాడుతూ..తాను ఏర్పాటు చేసిన కేఆర్ఆర్ యువ సైన్యం ద్వారా తన వంతుగా పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం చాలా అభినందనీయమని,రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు ఇలాంటి వేడుకలు జరుపుకుంటూ మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని అన్నారు.రాకేష్ రెడ్డి వీర అభిమాని మహ్మద్ నయీమ్ పాషా ఆధ్వర్యంలో వీణవంక లో కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు పోతరవేన సతీష్ యాదవ్,శ్రీపతి రెడ్డి, నల్ల కొండాల్ రెడ్డి,సునీల్,,మేకల ఎల్లారెడ్డి,పర్లపెల్లి రమేష్,చొక్కారావు,దేవెందర్ రెడ్డి,రామకృష్ణ,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!