ఓదెల మండలంలో ఘనంగా దసరా వేడుకలు

ఓదెల మండలంలో ఘనంగా దసరా వేడుకలు

ఓదెల అక్టోబర్ 2 (గోల్కొండ):
ఓదెల మండల వ్యాప్తంగా దసరా పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని రూపు నారాయణపేట శానగొండ ఇందుర్తి గుంపుల గ్రామాల్లో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే విజయ రమణారావు స్వగ్రామం అయిన రూపు నారాయణపేట గ్రామంలో జరిగిన దసరా వేడుకలలో ఎమ్మెల్యే విజయ రమణారావు, ఆయన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ప్రజలందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయ దశమి తో ప్రజలు మరిన్ని విజయాలు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ తాజా మాజీ సర్పంచు అంకం రమేష్, మాజీ ఎంపీటీసీ నీరులా శ్రీనివాస్, పాక్స్ డైరెక్టర్ బొంగోని శ్రీనివాస్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, ఓదెల మల్లికార్జున స్వామి ఆలయ చైర్మన్ మొండయ్య, ఆలయ డైరెక్టర్ జిల్క రవీందర్, నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!