ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్

ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్

హైదరాబాద్, నవంబర్ 15:(గోల్కొండ): మొత్తానికి ‘ఐ బొమ్మ’ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అతడ్ని నాంపల్లి కోర్టుకి తరలించారు. 2019 నుండి ‘ఐ బొమ్మ’ వెబ్సైట్‌లో పైరసీ చేసిన వీడియోలు అప్లోడ్ చేస్తున్నరవి.. ఇంతకాలం పోలీసులకు చిక్కకుండా తప్పించుకుతిరుగుతున్నాడు.ఆరు సంవత్సరాల కాలంలో వేలాది పైరసీ సినిమాలను వెబ్సైట్లో అప్లోడ్ చేశాడు రవి. థియేటర్లో విడుదలైన సినిమాలను గంటల వ్యవధిలో వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్న నిందితుడు రవి కారణంగా టాలీవుడ్‌ నిర్మాతలకి వేలాది కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది.తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫిర్యాదు మేరకు ఐ బొమ్మతోపాటు, 65 పైరసీ వెబ్సైట్ లపై కేసు నమోదు చేసిన సిసిఎస్ పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.
ఇప్పటికే ఈ కేసులో ఐదుగురు కీలక నిందితులను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నన్ను పట్టుకోలేరంటూ గతంలో పోలీసులకే సవాలు విసరాడు రవి. ఈ నేపథ్యంలో రవిని ఈరోజు ఉదయం సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రవి నుంచి సేకరించిన వివరాలతో రవి ఏజెంట్ల నెట్వర్క్‌తోపాటు హ్యాండ్లర్ల నెట్వర్క్ పై కూడా సీసీఎస్ పోలీసులు కూపీ లాగుతున్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!