అన్నదాతకు తప్పని యూరియా కష్టాలు  …

అన్నదాతకు తప్పని యూరియా కష్టాలు …

వీణవంకలో ఉదయాన్నే యూరియా కోసం లైన్ లో నిలపడిన రైతులు వీణవంక సెప్టెంబర్ 10(గోల్కొండ)
దేశానికి అన్నంపెట్టే రైతన్నకు ఆరుగాలం పండించాల్సిన పంటలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం యూరియా పంపిణీ చేయలేక రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు.ఓ వైపు చేతికిచ్చే పంటలను చూసుకోవాలో లేక యూరియా వస్తుందని సొసైటీల చుట్టూ పడిగాపులు కాయలో తెలియడం లేదని రైతులు మండిపడుతున్నారు.కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రం లోని పీఏ సీ ఎస్ సొసైటీ వద్ద యూరియా వచ్చిందనే సమాచారం తో మండల కేంద్రం లోని నూతన సహకార సంఘం వద్ద బుధవారం తెల్లవారు జామునుండే రైతులు ఆఫిసు వద్ద కు చేరుకొని ఆధార్ కార్డులు క్యూ లైన్ లో పెట్టి అధికారుల కోసం వేచి చూస్తున్నారు.అధికారులను వివరణ కోరగా వచ్చిన 420 యూరియా బస్తాలను నర్సింగాపూర్, వీణవంక, రామకృష్ణాపూర్,కనపర్తి,బ్రహ్మణపల్లి, కనపర్తి, పోతిరెడ్డిపల్లి, మల్లనపల్లి,వల్బపూర్ గ్రామాలకు సరి చేసి ఇవ్వడం జరుగుతుందన్నారు.క్యూ లైన్ లో ఉన్న వారికి ఒక్కో ఆధార్ కార్డు పై ఒక్కో యూరియా బస్తా ఇస్తామని తెలుపారు. రైతులు కార్యాలయం వద్ద క్యూలైన లో గందరగోళం ఏర్పడం తో పోలిసులు చేరుకున్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!