
స్వాతంత్య్ర సమరయోధుల ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి … రామగుండం సీపీ అంబర్ కిషోర్
గోదావరిఖని ఆగస్టు 15 (గోల్కొండ )
రామగుండం కమిషనరేట్ కార్యాలయం లో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు . ఈ సందర్భంగా మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాయుధ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గౌరవ వందనాన్ని స్వీకరించి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు .
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. రామగుండము కమీషనరేట్ ప్రజలకు పోలీస్ అధికారులకు, సిబ్బందికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర దినోత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని బారత దేశపు ప్రజలకు ఒక అందమైన ప్రశాంతమైన జీవితాన్ని ఇవ్వడానికి ఎంతో మంది త్యాగధనుల పుణ్యఫలం స్వాతంత్ర సమరయోధుల ప్రాణత్యాగం వలన స్వాతంత్రం సిద్ధించిందని వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. భవిష్యత్తు తరాలకు మంచి అభివృద్ధిని సాధించి చూపించాలన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత సుపరిపాలనలో మన దేశం ఎంతో అభివృద్ధి చెందిందని, సర్వస్వం అర్పించి మనకు స్వేచ్ఛను కల్పించిన త్యాగధనులకు మనస్ఫూర్తిగా అంజలి ఘటిస్తూ దేశానికి అంకితం కావడంలోనే ప్రతి మనిషికి సార్థకత లభిస్తుందని అన్నారు. పోలీసు అధికారులుగా మనమంతా జాతి సమగ్రతకై, శాంతి సమాజ స్థాపనకై తద్వారా ప్రజల అభివృద్ధికి బాటలు వేసేందుకు దృఢనిశ్చయంతో పని చేయాలని, ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ నీతి నిజాయితీగా సేవలు అందించాలని తెలిపారు.ఈ కార్యక్రమం లో గోదావరి ఖని ఏసీపీ రమేష్, స్పెషల్ బ్రాంచ్ ఎసిపి మల్లారెడ్డి, ట్రాఫిక్ ఏసిపి శ్రీనివాస్ , ఎ ఓ శ్రీనివాస్, సీఐ లు, ఎస్ఐ లు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు శ్రీనివాస్, వామన మూర్తి, సూపరింటెండెంట్ ఇంద్రసేనారెడ్డి సందీప్ సంధ్య, సిసి హరీష్ వివిధ వింగ్స్ , సిపిఓ, ఎ ఆర్ స్పెషల్ పార్టీ, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు


