స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆశీర్వదించండి. ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆశీర్వదించండి. ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు

పెద్దపల్లి ఆగస్టు 10 (గోల్కొండ ప్రతినిధి ) :పెద్దపల్లి మండలం అప్పన్నపేట, బొంపల్లి, మేరపల్లి గ్రామాల్లో ఆదివారం రూ.1 కోటి 10 లక్షల నిధులతో చేపట్టిన రోడ్లు, డ్రైనేజీలు, వివిధ అభివృద్ధి పనులకు పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. మహిళా సంఘ భవనలు అప్పన్నపేటలో కామన్ సర్వీస్ సెంటర్ ప్రారంభించిన అనంతరం ఆయా గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేసి, ఇళ్ల నిర్మాణాలకు ముగ్గులు పోసరు.
అప్పన్నపేట గ్రామంలో అంబేద్కర్ గారి విగ్రహనికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు తెలిపారు. పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, కొత్తగా రేషన్ కార్డులు, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, రైతులకు రూ. రెండు లక్షల రుణమాఫీ, రూ.5వందలకే గ్యాస్ సిలిండర్, రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సదుపాయానికి రూ.10 లక్షల పెంపు, కటింగులు లేకుండా వడ్ల కొనుగోలు, సన్న వడ్లకు రూ. 500 బోనస్, ఇసుక సులభతరం వంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రజల ముంగిటకు తీసుకు వచ్చినట్టు తెలిపారు. ప్రతి కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని అన్నారు. మరోవైపు గ్రామ గ్రామాన ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు తెలియజేశారు. తమ సేవలను గుర్తించి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచే అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, అరె సంతోష్, సందవేణి రాజేందర్, చింతపండు సంపత్, కాలబోయిన మహేందర్,నుగుల్లా మల్లయ్య,ఏడ్లి శెంకర్,బొంకురి అవినాష్,ముత్యాల నరేష్,జెడల రాజు,వేరేశం, రాజు,శ్రీనివాస్,శ్రీకాంత్ శ్రీనివాస్, నరేష్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!