సురభి గ్రూప్ ఆఫ్  హోటల్స్ ఆధ్వర్యంలో ఘనంగా అన్న దాన కార్యక్రమం

సురభి గ్రూప్ ఆఫ్ హోటల్స్ ఆధ్వర్యంలో ఘనంగా అన్న దాన కార్యక్రమం

అన్నదాతా సుఖీభవ అంటూ భక్తుల ఆశీర్వచనాలు

మంచిర్యాల సెప్టెంబరు 04 (గోల్కొండ ): సురభీ గ్రూప్ ఆఫ్ హోటల్ సంస్థ ల చైర్మెన్ కోటగిరి రవికుమార్ , స్వాతి దంపతుల ఆధ్వర్యం లో వినాయక నవ రాత్రోత్సవాల్లో ఎనిమిదో రోజు న జిల్లా కేంద్రం లోని బెల్లంపల్లి చౌరస్తా లో గల బ్రాంచి లో అన్న దానం 2000 వేల మందికి పైగా ఘనంగా నిర్వహించారు.ప్రజలు అన్నదాతా సుఖీభవ అంటూ భక్తుల ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా సురభీ సంస్థ చైర్మెన్ కోటగిరి స్వాతి , రవి కుమార్ మాట్లాడుతూ అన్ని దానాల్లో అన్న దానం గొప్పదని. సామాజిక కార్యక్రమాలలో సైతం ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు.గణేశ్‌ నవరాత్రి ఉత్సవాల్లో సురభి హోటల్ అన్నదాన కార్యక్రమాలకు ప్రత్యేక స్థానం ఏర్పడింది. దాదాపు వినాయక ప్రతిమ ప్రతిష్ఠించిన ప్రతిచోటా అన్నదానం తప్పనిసరయింది. జనాభా సంఖ్యకు అనుగుణంగా భారీగానే అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో జిల్లా లో అధికారులు , రాజకీయ నాయకులు, వివిధ రంగాల ప్రముఖుల,సురభి సంస్థ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!