రోడ్లపై వరి ధాన్యం ఆరబెట్టొదు.. ప్రమాదాల నివారణకై.. రైతులకు అవగాహనకల్పిస్తున్న పోలీసులు

రోడ్లపై వరి ధాన్యం ఆరబెట్టొదు.. ప్రమాదాల నివారణకై.. రైతులకు అవగాహనకల్పిస్తున్న పోలీసులు

వీణవంక,ఏప్రిల్ 11(గోల్కొండ):ప్రధాన రహదారి పై రైతులు పండించిన ధాన్యం అరబోయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, కళ్లాల వద్దనే ధాన్యం ఆరోబోయాలని సీఐ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో గత రెండు రోజుల నుండి పోలీసులు రైతులకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు.మండల పరిధిలోని వల్బపూర్, నర్సింగాపూర్ గ్రామాల లో ని రైతులకు రోడ్డు మార్గంలో పండించిన ధాన్యం ను అరబెట్టరాదు అని మొదటి విడుతగా రైతులకు కౌన్సిలింగ్ ఇవ్వడం ఏర్పాటు చేశారు.శనివారం రోజు ధాన్యం తియ్యని రైతులకు పోలీసులు నోటీసులను జారీ చేశారు.రోడ్ల పై ప్రమాదాల ను నివారించడానికి మండలం లోని రైతులు తాము పండించిన వరిధాన్యాన్ని తమ కల్లాలలో ఆరబెట్టు కొని పోలీసుల కు సంహరించాలని జమ్మికుంట రూరల్ సీఐ లక్ష్మి నారాయణ, ఎస్సై తిరుపతి లు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!