
రాష్ట్రపతికి కోర్టు గడువు విధించవచ్చా..? కేంద్రం ఏమందంటే..
ఢిల్లీ ఆగస్టు 16 : శాసనసభలు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు, రాష్ట్రపతి నిర్దిష్ట గడువులోగా ఆమోదించాలంటూ కోర్టులు వారిని నిర్దేశించవచ్చా అనే అంశంపై తమ అభిప్రాయాలు తెలియజేయాలని ఇటీవల సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. రాష్ట్రపతి, గవర్నర్లపై గడువు విధించే అధికారం కోర్టుకు ఉండదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. రాజ్యాంగపరమైన విషయాల్లో న్యాయస్థానం జోక్యం చేసుకుంటే గందరగోళం తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
TAGS Hot News


