రాయికల్ లో ఘనంగా దసరా వేడుకలు

రాయికల్ లో ఘనంగా దసరా వేడుకలు

 

రాయికల్, అక్టోబర్ 02(గోల్కొండ):
రాయికల్ మండలంలోని అన్ని గ్రామాల్లో గురువారం దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని శ్రీ చెన్నకేశవనాథ ఆలయం సమీపంలో కనుకదుర్గ అమ్మవారి చిత్రపటం వద్ద ఆనవాయితీ ప్రకారం గుమ్మడికాయ కొట్టి ఊరేగింపుగా శివాజీ నగర్ వద్ద ఏర్పాటు చేసిన జమ్మి చెట్టు వద్దకు వెళ్ళారు. అక్కడ అర్చకులు సతీష్ శర్మ ప్రత్యేక శమీ పూజ నిర్వహించిననతరం పట్టణ ప్రజలు చెన్న కేశవనాథ స్వామి వారిని దర్శించుకున్నారు. శివాజీ రెడ్డి యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన దుర్గాదేవి అమ్మవారిని ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఊరేగింపు అనంతరం శివాజీ విగ్రమ వద్ద కనుకదుర్గ అమ్మవారు మహిషాసుర మర్దిని దహనం చేశారు. దసరా వేడుకల్లో భాగంగా పాత బస్టాండ్ లో ఏర్పాటు చేసిన లేజర్ షో హైలెట్ గా నిలిచింది. ఈకార్యక్రమంలో పట్టణ ప్రజలు, మహిళలు, మాజీ ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!