
రాజకీయాలకు సంబంధం లేకుండా కల్వల ప్రాజెక్టు నిర్మించాలి..జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

గత ప్రభుత్వం లో 70కోట్లు జీవో విడుదల
6వేల ఎకరాలు సాగుకు కల్వల నీరు…
కరీంనగర్, అక్టోబర్ 31(గోల్కొండ):
రాజకీయాలకు సంబంధం లేకుండా రైతుల బాగు కోసం మత్తడి పనులను తొందరగా బాగు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో కొట్టుకుపోయిన కల్వల మత్తడిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…6 వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చే ఈ ప్రాజెక్ట్ పై వందలాది రైతు కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని కవిత అన్నారు.
శంకరపట్నం మండలంలోని కల్వల మత్తడి కొట్టుకుపోయి 3 ఏండ్లు అయ్యిందని,దీని రిపేర్ కోసం గత ప్రభుత్వమే రూ. 70 కోట్లు విడుదల చేస్తూ జీవో ఇవ్వగా, తర్వాత ప్రభుత్వం మారటంతో పనులు జరగటం లేదన్నారు.ఈ మత్తడిని రిపేర్ చేయించాలని హుజురాబాద్, మానకొండూరు ఇద్దరు ఎమ్మెల్యేలను కోరారు.మానకొండూరు లో మత్తడి ఉంటే హుజురాబాద్ లో నీళ్లు పారుతున్నాయని
దీంతో ఈ రెండు నియోజకవర్గాల ఎమ్మెల్యే లు ఒకరు రిపేర్ చేయిస్తే ఒకరికి పేరు వస్తదన్నట్లుగా వ్యవహరిస్తున్నారని అని తెలిపారు
కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోని గతంలో ఇచ్చిన రూ. 70 కోట్ల జీవో ను పాస్ చేయాలన్నారు.
రాజకీయాలకు సంబంధం లేకుండా రైతుల బాగు కోసం మత్తడి పనులను తొందరగా బాగు చేసి రైతులకు ఆదుకోవాలన్నారు.
గతంలో కట్ట తెగినప్పుడు అప్పటి ప్రజాప్రతినిధులు స్పందించి తొందరగా దీన్ని బాగు చేయించారు. అదే స్ఫూర్తితో ఇప్పుడు కూడా మత్తడి బాగు చేయించాలని అన్నారు.
రైతు లేనిదే రాజ్యం లేదు..రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
మొంథా తుపాను కారణంగా తెలంగాణ మొత్తం రైతులు నష్టపోయారు
కానీ ముఖ్యమంత్రి వరంగల్, ఖమ్మం రైతులకు మాత్రమే ఎకరాకు రూ. 10 వేలు ఇస్తామన్నట్లుగా తెలిపారు.శంకరపట్నంలో కూడా వరి రైతులు నష్టపోయారు. వారికి కూడా పరిహారం ఇవ్వాలన్నారు.
ఎకరాకు రూ. 10 వేలు కాదు. ఎకరాకు రూ. 50 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.దాదాపు చేతికొచ్చిన పంట రైతులు నష్టపోయారు. ఇప్పుడు పంట కోసిన కూడా 25 శాతం వచ్చే పరిస్థితి లేదని ప్రభుత్వం రైతుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్నారు. కలెక్టర్ చొరవ చూపి అధికారులను ఫీల్డ్ కు పంపించి పంట నష్టం లెక్కలు తీయాలని కోరారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా కేంద్రం తరఫున రైతులకు పంట నష్టం పరిహారం ఇప్పించాలన్నారు.కల్వల మత్తడి రిపేర్ కోసం సీఎం తో ఎంపీ మాట్లాడాలని కవిత అన్నారు.ఈ ప్రాజెక్ట్ మీదనే దాదాపు 180 ముదిరాజ్ కుటుంబాలు ఆధారపడి ఉన్నందున
వారికి ఇదే జీవనాధారం. వెంటనే మత్తడి బాగు చేయించి వారిని ఆదుకోవాలన్నారు.సాంక్షన్ అయిన డబ్బులను తీసుకొచ్చి పనులు చేయించాలనిమానకొండూరు, హుజురాబాద్ ఎమ్మెల్యేలు చొరవ తీసుకొని పనులు చేయించాలని అన్నారు.


