యూరియా కోసం రైతుల ధర్నా  రాస్తారోకో

యూరియా కోసం రైతుల ధర్నా రాస్తారోకో

కరీంనగర్ ఆగష్టు 11 (గోల్కొండ ప్రతినిధి ): కరీంనగర్ జిల్లా వీణవంక మండలం నర్సింగాపూర్ ప్రాథమిక సహకార సంఘము గోదాం వద్ద యూరియా కోసం రైతులు కరీంనగర్ జమ్మికుంట రహదారి పై ధర్నా రాస్తారోకో నిర్వహించారు.వరి,మొక్కజొన్న ,పత్తి పంటలు వేసిన రైతులు పంటలకు యూరియా వేయాలిసిన సమయంలో మార్కెట్లో యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.సొసైటీ గోదాం కి 450 యూరియా బస్తాలు వచ్చాయని తెలియడంతో గోదాం వద్దకి రైతులు భారీగా తరలివచ్చారు.వచ్చిన రైతులకు సరిపోయే యూరియా అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహించిన రైతులు రోడ్డుపై ధర్నా చేపట్టారు.ధర్నా విషయం తెలుసుకున్న పోలీసులు ధర్నా చేస్తున్న రైతులతో చర్చించి అందుబాటులో ఉన్న యూరియా ను రైతులకి పంపిణీ చేయించారు.రైతులకు సరిపడా యూరియా అందుబాటులోకి తీసికురావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను రైతులు కోరుతున్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!