
బీర్ల ఐలయ్య నివాసంలో ఘనంగా రాఖీల పండుగ వేడుకలు.
హైదరాబాద్ సిటి ఆగస్టు 09 ( గోల్కొండ)
హైదరాబాద్ బంజారాహిల్స్ లో ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అధికారిక నివాసంలో రాఖీల పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి.ఆలేరు నియోజకవర్గం ఇతర ప్రాంత అడబిడ్డలు,మహిళలు,అక్క చెల్లెల్లు బీర్ల అయిలయ్యకు రాఖీలు కట్టి,రాఖీల పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ రాఖీ పండుగ వేడుకల్లో భాగంగా బీర్ల అయిలయ్య అడబిడ్డలకు,అక్క చెల్లెళ్లకు చీరలను బహుమతులుగా అందజేసి,అన్న చెల్లెళ్ల అనుబంధాన్ని వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ,ఆలేరు నియోజకవర్గ అక్క చెల్లెళ్లకు,ఆడబిడ్డలకు రాఖీల పండుగ శుభాకాంక్షలు తెలిపారు.అక్క చెల్లెళ్లు ఆడబిడ్డలతో వచ్చిన ప్రజాప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని ముఖ్యమంత్రి లక్ష్యంతో ముందుకు వెళ్లడం జరుగుతుందని.ఈ రాఖీ పండుగ సందర్భంగా మరోసారి అక్క చెల్లెలు అందరికీ రాఖీల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ. మీ సోదరుడుగా,మీ అన్నగా,మీ తమ్ముడిగా,వెన్నంటి ఉండి ఆలేరు అభివృద్ధిలో,మీ సహాయ సహకారాలతో ముందుకు వెళ్తానని అన్నారు,మా అక్క చెల్లెల ఆశీర్వాదం నాపై ఎప్పటికీ ఉండాలని కోరుతూ మరోసారి రాఖీల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.


