ప్రజలందరూ ఆ విగ్నేశ్వరుని ఆశీస్సులతో సుభిక్షంగా ఉండాలి

ప్రజలందరూ ఆ విగ్నేశ్వరుని ఆశీస్సులతో సుభిక్షంగా ఉండాలి

ఘనంగా గణేష్ నిమర్జన ఏర్పాట్లు.
పెద్దపల్లి సెప్టెంబరు 06 (గోల్కొండ ):
పెద్దపల్లి పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ వద్ద శుక్రవారం రోజున గణపతి నిమజ్జన వేడుకలను పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణా రావు మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ తో, ప్రారంభించరు.అనంతరం ఎంతో నిష్టతో నవరాత్రులు పూజలు నిర్వహించిన గణనాథుడిని భారీ క్రేన్ ద్వారా నిమర్జనం చేశారు. అనంతరం వేదపండితులు వేదమంత్రాలతో గౌరవ ఎమ్మెల్యే విజయరమణ రావు ని ఘనంగా ఆశీర్వాదించి సన్మానించరు
ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు గణపతి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో తొమ్మిది రోజులు జరుపుకొని నేడు నిమజ్జనం కార్యక్రమాలను జరుపుకుంటున్నారన్నారు. పెద్దపల్లి మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో పెద్దపల్లి ఎల్లమ్మ చెరువు కట్టపై నిమజ్జన వేడుకలకు సర్వం సిద్ధం చేశామన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ వారు పెద్దపల్లి సబ్ డివిజన్లోని పోలీసు బలగాలను అణువణునా మోహరించి పకడ్బందీ ఏర్పాట్లు చేశారన్నారు. విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా విద్యుత్ శాఖ సర్వం సిద్ధం చేసిందని పేర్కొన్నారు. సింగరేణి కోల్ మైన్స్ నుండి భారీ క్రేన్లను తెప్పించి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా నిమజ్జనానికి పూర్తి ఏర్పాట్లు చేశామని ఈ సౌకర్యాలను ప్రజలందరూ వినియోగించుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ ఈర్ల స్వరూప మరియు పెద్దపల్లి ఏసీపీ, సీఐ,ఎస్ఐ లు మరియు విద్యుత్ శాఖ అధికారులు, మున్సిపల్ శాఖ అధికారులు మరియు మాజీ కౌన్సిలర్లు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!