పెద్దపల్లి నియోజకవర్గంలో  ఇందిరమ్మ ఇంటి తొలి గృహప్రవేశం..

పెద్దపల్లి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇంటి తొలి గృహప్రవేశం..

పెద్దపల్లి,ఆగస్టు10 (గోల్కొండ ప్రతినిధి) ఎన్నో ఏళ్లుగా సొంతింటి నిర్మాణం కోసం కలలు కన్న కుటుంబాలు నేడు ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలతో వారి సొంతింటి కలలను నెరవేర్చుకుంటున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు అన్నారు.పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కోనరావుపేట గ్రామంలో ఆవుల ఐలమ్మ,ఐలయ్యలు నిర్మించుకున్న నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయరమణ రావు ఆదివారం రోజున ముఖ్య అతిథిగా పాల్గొని వారి కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు.పేద ప్రజల దశాబ్దాల స్వంతింటి కల ప్రజాప్రభుత్వంలో నెరవేరుతుందని అన్నారు.ప్రతి పెదవాడికి కాంగ్రెస్ ప్రభుత్వంలో స్వంతింటి కల నెరవేరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు మరియు మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!