
పండగపూట కల్తీ మద్యం అమ్మకాల పరేషాన్ …?
జోరుగా బెల్ట్ షాప్ లో జీరో మాల్ దందా …?
గాంధీ జయంతి తో వైన్స్ షాప్ ల మూసివేత …
మామూళ్ల మత్తులో ఎక్సయిజ్ అధికారులు ..?
కరీంనగర్ సెప్టెంబర్ 30 (గోల్కొండ ): దసరా పండుగతో పల్లెల్లో పట్టణాల్లో మద్యం షాపులు మందు బాబులతో కిటకిటలాడుతున్నాయి .మరో నెల రోజుల్లో వైన్స్ షాపుల టెండర్లు పూర్తి కావలిసి ఉంది.దింతో ఇదే అదునుగా బెల్ట్ షాపులలో కల్తీ మద్యం అమ్ముతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.గ్రామాల్లో గుడుంబా సైతం విచ్చల విడిగా అమ్ముతున్నారు.మద్యం అమ్మకాల టార్గెట్ తో ఎక్సయిజ్ అధికారులు బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తూ గ్రామానికి పదికి పైగా బెల్ట్ షాపులను నిర్వహిస్తున్నారు.వైన్స్ షాప్ యజమానులు బెల్ట్ షాపులకు ఎక్కువ రేట్ కు విక్రహిస్తు సొమ్ముచేసుకుంటున్నారు.జమ్మికుంట ,వీణవంక ,హుజురాబాద్ ,శంకరపట్నం మండలంలో ప్రతి గ్రామంలో బెల్ట్ షాప్ ల ద్వారానే మద్యం విక్రహిస్తున్నారు.పెద్దపల్లి సుల్తానాబాద్ వంటి ప్రాంతాల నుంచి కల్తీ మద్యం తీసుకు వచ్చి విక్రహిస్తున్నట్టు గతంలో ఆరోపణలు వెల్లువెత్తాయి.దసరా పండుగ అక్టోబర్ 02 న గాంధీ జయంతి రావడంతో వైన్స్ షాప్ లు బందు ఉండడంతో బెల్ట్ షాపులలో విచ్చల విడిగా మద్యం అమ్మెందుకు ఎక్సయిజ్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.గ్రామాలలో కల్తీ మద్యం అమ్మకుండా చూడలిసిన ఎక్సయిజ్ అధికారులు వైన్స్ టెండర్ల ప్రక్రియలో బిజీ గా ఉండడంతో గుడుంబా, బెల్ట్ షాపుల లో మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి.మద్యం షాప్ ల గడువు తీరనుండడంతో కల్తీ మద్యం అమ్మకాలు జరిగేలా ఉన్నాయని మందు బాబులు ఆరోపిస్తున్నారు.ఇప్పటికైనా ఎక్సయిజ్ ఉన్నత అధికారు లు పట్టించుకోని గ్రామాల్లో గుడుంబా కల్తీ మద్యం అమ్మకుండా తనిఖీలు చేపట్టాలని మందుబాబులు కోరుతున్నారు.


