నాయకులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలి పెద్దపల్లి  ఎమ్మెల్యే విజయరమణ రావు

నాయకులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు

ప్రజాపాలనలో ప్రజలకు సంక్షేమ ఫలాలు
పెద్దపల్లి ఆగస్టు 12 ( గోల్కొండ ప్రతినిధి ):
పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని మడిపల్లి, పాత మడిపల్లి, ఆశన్నపల్లి, పెగడపల్లి గ్రామాల్లో మంగళవారం రోజున సీసీ రోడ్లు, ప్రభుత్వ పాఠశాలల ప్రహరీ గోడల నిర్మాణాలను ప్రారంభించి ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గులు పోసి ఇందిరమ్మ ఇల్లు మంజూరైన వారికి ప్రోసిడింగ్స్ పత్రాలను పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు అందజేశారు.కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలో సింగిల్ విండో ఆధ్వర్యంలో నూతన సోలార్ విద్యుత్ ఫ్లాంట్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేయడం జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం సంవత్సరాల లోపే పది సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగింది అన్నారు. గత బిఆర్ఎస్ పాలనలో పది సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రం ఎంతో వెనుకకు పోయిందని, ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని, రైతులకు రుణమాఫీ చేయలేదని, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతుల వడ్లు తరుగు పేరా దోపిడీ చేశారే తప్ప అభివృద్ధి ఎక్కడ జరిగిన దాఖలాలు లేవు అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రెండు లక్షల లోపు రుణమాఫీ జరిగిందని అన్నారు. రుణమాఫీ విషయములో ఏమైనా అనుమానాలు ఉంటే మీ మీ గ్రామాల్లోని ముఖ్య కూడళ్లలో రుణమాఫీ రైతుల పేర్లు, ఎంత రుణమాఫీ జరిగిన విషయాన్ని గోడ ప్రతులు అంటించడం జరిగింది అన్నారు. రుణమాఫీ విషయములో గగ్గోలు పెట్టే ప్రతిపక్ష నాయకులు రుణమాఫీలో వారి పేర్లు ఉండడంతో ప్రస్తుతం నోరు మూసుకున్నారు అన్నారు. బిఆర్ఎస్ నాయకులైన బావా బామ్మర్దులు లేనివి కల్పించి ప్రజలు మభ్య పెట్టే పనిలో పడ్డారని వారి మాటలు ప్రజలు నమ్మేస్థితిలో లేరు అన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక సుమారు 10 సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయి అన్నారు. గత బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు విచ్చలవిడిగా కరెంటు బిల్లులు వెయ్యడంతో పాటు నిరుపేదలు బిల్లులు కట్టకుంటే వారు మీద కూడా కేసులు చేయడం జరిగింది అన్నారు. దళిత కాలనీలో బిల్లులు కట్టకుంటే జబర్దస్త్ గా కరెంటు వైర్లు తొలగించి కాలనీలనే చీకటిలో ఉంచారు అని గుర్తుచేశారు . ఆరు నెలలు సంవత్సరమునకు ఒక్కసారి ఎసిడి అదనపు బిల్లులు వేసి ప్రజలను ఎంతో ఇబ్బంది పెట్టారు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 200 యూనిట్ల ఉచిత కరెంటుతో ఏ గ్రామానికి వెళ్లిన సుమారు 95% గ్రామ ప్రజలకు కరెంటు బిల్లు రావడం లేదు అన్నారు. ఒక గుంట నుండి ఎన్న ఎకురాలైన సాగు చేసే ప్రతి రైతుకు ఎకరాకు ఆరు వేలు చొప్పున ఈ రాష్ట్రంలో 9,000 కోట్లు ప్రభుత్వం జమ చేసింది అన్నారు. గత ప్రభుత్వం సన్న వడ్లకు బోనస్ ఇస్తామని ప్రకటించి రైతులను మోసం చేసిందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం క్వింటాలకు 500 బోనస్ మాట తప్పకుండా ప్రతి రైతు ఖాతాలో పడ్డాయి అన్నారు. గత వేసవి పంటకు త్వరలో బోనస్ పడుతుంది అన్నారు. చివరి అయ్యాకట్టు వరకు సాగునీరు అందించిన ఘనత తమాదేనని అన్నారు.ప్రభుత్వం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అహర్నిశలు పనిచేస్తుంది అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన వారు ప్రతి ఒక్కరు ఇల్లు నిర్మించుకోవాలని మంజూరు కాని నిరుపేదలకు కూడా ఇల్లు ఇవ్వడం జరుగుతుంది అన్నారు. గత పది సంవత్సరాలుగా రేషన్ కార్డులు రాక ప్రజలు ఇబ్బంది పడ్డారని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేషన్ కార్డులు అర్హులైన అందరికీ ఇవ్వడం జరిగింది అన్నారు. సంవత్సర కాలంలోనే ఇన్ని సంక్షేమ పథకాలు గ్రామాల అభివృద్ధితో ముందుకు పోతున్న గ్రామాల ప్రజలు నన్ను ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపించినట్లు నేను సూచించిన అభ్యర్థిని జడ్పిటిసి, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డ్ మెంబర్ ఎన్నికల్లో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో రవీందర్ రావు, మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాజాన వేన సదయ్య, సింగిల్ విండో చైర్మన్లు రాం చందర్ రెడ్డి,ఆళ్ల సుమన్ మరియు మార్కెట్, సింగిల్ డైరెక్టర్లు మరియు మాజీ సర్పంచ్లు,ఎంపిటిసిలు మరియు ఎంపీడీవో, హౌసింగ్ డిఇ, ఏ ఈ,ఆయా గ్రామాల కార్యదర్శిలు,కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు , గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!