
ధర్మారంలో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు
ధర్మారం సెప్టెంబర్ 10 (గోల్కొండ): మండల కేంద్రంలో వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలను మండల రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ధర్మారం టౌన్ రజక సంఘం ప్రెసిడెంట్ రాము, ఇతర నాయకులు ఐలమ్మ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఐలమ్మ పోరాట స్ఫూర్తిని వారు స్మరించుకున్నారు. నిజాం రాజుల నిరంకుశ పాలనలో రజాకార్లను ఎదిరించి ఐలమ్మ పోరాడిందని నాయకులు గుర్తు చేశారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి తరం మహిళలు కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల రజక సంఘం నాయకులు ఎల్లయ్య, నర్సింగం, శ్రీకాంత్, రాజ్‌కుమార్, కాలువ రాయలింగు, జిమ్మీ, తదితరులు పాల్గొన్నారు.
TAGS Hot News


