
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా పని చేయాలి….. రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామ్యం అవుదాం…
మాదకద్రవ్య దుర్వినియోగం లేని సమాజాన్ని నిర్మించడానికి ఐక్యంగా పోరాడుదాం : రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్.,
మంచిర్యాల ఆగస్టు 13 (గోల్కొండ ప్రతినిధి ):మాదకద్రవ్య దుర్వినియోగం లేని సమాజాన్ని నిర్మించడానికి ఐక్యంగా పోరాడుదామని రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్ పిలుపునిచ్చారు .బుధవారం రామగుండం పోలీస్ కమీషనరేట్ కార్యాలయం లో
నాషా ముక్త్ భారత్ అభియాన్-2025 లో భాగంగా మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించరు. ఈ కార్యక్రమం కు రామగుండం పోలీస్ కమీషనర్ హాజరై అధికారులు, సిబ్బంది తో కలిసి మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞ చేశారు .ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గంజాయి నిర్మూలన, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా తీసుకుంటున్న చర్యలలో భాగంగా మాదకద్రవ్య దుర్వినియోగం యొక్క దుష్ప్రభావాల గురించి విస్తృత అవగాహన కల్పించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా నాషా ముక్త్ భారత్ అభియాన్ ను అమలు చేస్తోందని అన్నారు. ఈ అవగాహన ప్రచారం యొక్క 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు రామగుండం పోలీస్ కమీషనరేట్ పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పరిధిలో మాదకద్రవ్య దుర్వినియోగానికి వ్యతిరేకంగా పోలీస్ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, యువత, మహిళలు, ఉద్యోగులు ప్రజల నుండి విస్తృత భాగస్వామ్యాన్ని చేయాలనే ముఖ్య ఉద్దేశ్యంతో సామూహిక ప్రతిజ్ఞను నిర్వహించడం జరుగిందని తెలిపారు . రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా సరఫరా సాగుచేసిన చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని కేసులు నమోదు చేసి,రౌడీ షీట్స్ ఓపెన్ చేసి పీడియాక్ట్అ మలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం ద్వారా మాదకద్రవ్య దుర్వినియోగం లేని సమాజాన్ని నిర్మించడానికి మన ఐక్య నిబద్ధతకు శక్తివంతమైన చిహ్నంగా ఉపయోగపడుతుంది అన్నారు.నేను మాదక ద్రవ్యాల పై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, నేను డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ, నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు మరియు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తానని, నేను డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేపించారు.ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఏసిపి మల్లారెడ్డి, ట్రాఫిక్ ఏసిపి శ్రీనివాస్ ఏవో శ్రీనివాస్, యాంటీ నార్కోటిక్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్, సిసిఆర్ బీ ఇన్స్పెక్టర్ సతీష్,పిసిఆర్ ఇన్స్పెక్టర్ రవీందర్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ బాబురావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్లు భీమేష్, శ్రీనివాస్, ఆర్ ఐ లు శ్రీనివాస్ వామనమూర్తి, సిపిఓ సూపరిండెంట్ లు ఇంద్రసేనారెడ్డి సందీప్, సంధ్య, వివిధ విభాగాలకు చెందిన ఎస్ఐలు, ఆర్ ఎస్ ఐ లు, సిబ్బంది పాల్గొన్నారు.


