తెలంగాణాలో ఘనంగా బొడ్డెమ్మ వేడుకలు ప్రారంభం

తెలంగాణాలో ఘనంగా బొడ్డెమ్మ వేడుకలు ప్రారంభం

 

వీణవంక,సెప్టెంబర్ 12(గోల్కొండ):తెలంగాణా వ్యాప్తంగా మొదలైన బొడ్డెమ్మ పండుగ వేడుకలు.కరీంనగర్ జిల్లా వీణవంక మండలం నర్సింగాపూర్ గ్రామంలోని హరిహర క్షేత్రం దేవస్థానం మహిళా భక్త మండలి ఆధ్వర్యంలో మహిళలు శుక్రవారం రోజు ‘బొడ్డెమ్మ పండుగ’ వేడుకలు ఘనంగా ప్రారంభం అయ్యాయి.

బొడ్డెమ్మవిశిష్టత- విధానం
ఇది గౌరీ దేవుని ఆరాదించే ఒక రూపం,బొడ్డెమ్మ పండుగ మట్టి పూలతో ముడిపడిన ఒక ప్రకృతి పండుగ. ఇది మనిషికి మట్టికి మరియు ప్రకృతి కి ఉన్న అనుబందాన్ని తెలియజేస్తుంది.బతుకమ్మ పండుగకు ఒక సన్నాహం లాంటిది బొడ్డెమ్మ పండుగ.బొడ్డెమ్మ పిల్లల పండుగ అయితే, బతుకమ్మ పెద్దల పండుగ.ఇది ఒక దాని వెనుక ఒకటి వచ్చే సాంప్రదాయం లో బొడ్డెమ్మ పండుగ వినాయక చవితి పండుగ తర్వాత వచ్చే భాద్రపద బహుళ పంచమి నుండి తొమ్మిది రోజులు , అశ్వయుజ శుద్ధ పాడ్య మికి ముందు వచ్చే అమావాస్యవరకు తొమ్మిది రోజుల పాటు బొడ్డెమ్మ పండుగను, పాటలు పాడుతూ, పూజలు చేస్తారు.ఈ పండుగ నుమహిళ లందరూ కలిసి స్థానిక పుట్ట దగ్గరికి వెళ్లి అక్కడ పసువు కుంకుమ లతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.పుట్టను తవ్వి మట్టి తీసి బొడ్డెమ్మను తయారు చేసి, రకరకాల పూలను సేకరించి బొడెమ్మ వద్ద పేర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.చివరి రోజు నిమజ్జనం చేస్తారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!