
ఘనంగా ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు

నవరాత్రి ఉత్సవాలు మండలం లో వివిధ గ్రామాలలో ఘనంగా ప్రారంభం ఆయ్యాయి. గ్రామాలలో భక్తులు ఉత్సవాల సందర్బంగా ప్రత్యేక మండపాలను ఏర్పాటు చేసి, అమ్మవారి ప్రతిమలను నెలకొల్పి తొలి రోజు ఘనంగా పూజలునిర్వహించారు. నర్సింగాపూర్ లోని హరిహర క్షేత్రం వద్ద ఏర్పాటు చేసిన దుర్గ మాత విగ్రహాదాతలు గా సౌత్ ఆప్రికా లో ఉంటున్న నల్ల శివా రెడ్డి-స్వేత దంపతులు అందించారు. దుర్గ మాత విగ్రహం వద్ద మహిళలు ప్రత్యేక పూజలు చేశారు.తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు జరుగనున్నాయి.
TAGS Hot News


