గాయత్రీ పంపును సందర్శించిన మాజీ ఎంపీ

గాయత్రీ పంపును సందర్శించిన మాజీ ఎంపీ

కరీంనగర్ ఆగస్టు 16 (గోల్కొండ ప్రతినిధి ): కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ లోని గాయత్రీ పంపులను మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ లు శనివారం సందర్శించారు.ఈ సందర్భంగా బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు పై చెప్పేవన్నీ అబద్దాలేనని ఈ రోజు గాయత్రీ పంపు హౌస్ నీటి ఎత్తిపోతలు చుస్తే తెలుస్తుందని అన్నారు.ప్రాజెక్ట్ లో మూడు పిల్లర్లు కుంగితే ప్రాజెక్ట్ పూర్తిగా పనికి రాకుండా పోతుందా అని ప్రశ్నించారు.ఇప్పుడు చేపడుతున్న ఎత్తిపోతలు జూన్ జులై లో చేస్తే రైతులు వరినాట్లు వేసేవారని అన్నారు.వెంటనే కొండా పోచమ్మ రంగనాయక సాగర్ లాంటి ప్రాజెక్టులు నింపాలని కోరారు.
గాయత్రీ పంపు నుంచి ఐదు పంపుల ద్వారా 15750 క్యూసెక్కుల నీటిని అధికారులు మిడ్ మానేరుకు తరలిస్తున్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!