
ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ప్రణవ్
వీణవంక,ఏప్రిల్ 12(గోల్కొండ )
మండలం వల్భాపూర్ గ్రామంలో ఆదివారం నాడు ఇందిరమ్మ ఇళ్ల నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ హాజరైయ్యారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులు,పార్టీ నాయకులు ప్రణవ్ కు ఘన స్వాగతం పలికారు.లబ్ధిదారులు పెరుమాండ్ల నిహారిక – రాజు,
పెరుమాండ్ల రమా – రాజయ్య లకు ప్రణవ్ శుభాకాంక్షలు తెలిపారు.
సొంతింటి కల నెరవేరిన ఆనందంలో లబ్ధిదారులు కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వల్భాపూర్ గ్రామ సర్పంచ్ శ్రీమతి- కుమార్,ఉప సర్పంచ్ విజేందర్,మండల అధ్యక్షుడు రఘుపాల్ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ శ్రీపాల్ రెడ్డి,సీనియర్ నాయకులు సాహెబ్ హుస్సేన్,గ్రామ శాఖ అధ్యక్షులు,గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు,అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
TAGS Hot News


