
కృష్ణా గోదావరిలో తెలంగాణ వాటా తేల్చాలి….మంత్రి శ్రీధర్ బాబు
యూరియా కొరతకు కేంద్రమే కారణం...
కరీంనగర్ ఆగస్టు 15 (గోల్కొండ ప్రతినిధి )
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు 79 వ స్వాతంత్య్ర వేడుకలలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు.అనంతరం పోలీస్ ల గౌరవ వందనం స్వీకరించారు. ప్రభుత్వ ఉత్తమ ఉద్యోగులకు ప్రసంశ పత్రాలను అందజేశారు. అనంతరం మంత్రి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ .కృష్ణా గోదావరిలో తెలంగాణ వాటా తేల్చాలి ఇచ్చంపల్లి, తుమ్మిడిహెట్టి తెలంగాణ ప్రభుత్వ నిర్మించే ప్రాజెక్టులకు కేంద్ర అనుమతి ఇవ్వాలి.కృష్ణా గోదావరిలో తెలంగాణ వాట తేల్చి, తమ ప్రాజెక్టులకు అనుమతిచ్చాక పొరుగు రాష్ట్రం ఏపీ ఏ పేరుతో ఏ ప్రాజెక్టు కట్టుకున్న తమకు అభ్యంతరం లేదు.తెలంగాణ రైతుల ప్రయోజనాలను కాపాడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. కృష్ణా గోదావరి లో మన వాటా మనకు దక్కే వరకు తమ పోరాటం ఆగదు.
యూరియా కొరతకు కేంద్రమే కారణం.
చైనా ఎఫెక్ట్ తో రావాల్సిన కోటా రాలేదు.నాలుగైదు నెలలు గా ఇండెంట్ పెట్టాం
ప్రస్తుతం వచ్చిన యూరియా రైతులకు ఇబ్బంది లేకుండా సప్లై చేస్తున్నాం.
కొన్ని చోట్ల కావాలని కొందరు కృత్రిమ కొరతతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
న్యాయవాది వామన్ రావు దంపతుల హత్య కేసులో ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు.ఆనాటి నుంచే వామన్ రావు తండ్రీ సుప్రీంకోర్టు ను ఆశ్రయించి సిబిఐ విచారణ అడిగారు.సిబిఐ విచారణ లో దోషులు బయటికి వస్తారు.అమాయకులను కాకుండా అసలు దోషులకు శిక్షించాలని కోరుతున్నాం.


