మట్టి వినాయక విగ్రహాల పంపిణీ చేసిన నాయకులు

మట్టి వినాయక విగ్రహాల పంపిణీ చేసిన నాయకులు

మంచిర్యాల ఆగస్టు 27 (గోల్కొండ ):మంచిర్యాలలోని ఐబి చౌరస్తాలో ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను తెలంగాణ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మరియు బీసీ వెల్ఫేర్ అధికారి పురుషోత్తం నాయక్, వెంకటేశం, కుమ్మర సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నాంపల్లి శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా కుమ్మర సంఘం అధ్యక్షులు గంగాధరీ తిరుపతి ఆధ్వర్యంలో ఈ పంపిణీ చేశారు. మట్టి విగ్రహాలతో పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతాయని అన్నారు .ప్లాస్ట్రాఫ్ ప్యారిస్ తో చెరువులు కలుషితం అవుతాయని అన్నారు.అందరు మట్టి విగ్రహాలనే పూజించాలని పిలుపునిచ్చారు.మట్టి విగ్రహాలతో ప్రజలకు ఎలాంటి హానికరం ఉండదని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కుమ్మర సంఘం నాయకులు రాజేంద్రప్రసాద్, సలిగంటి చంద్రం, గంగన్న, రవీందర్, కేశన్న,పట్టణ కాంగ్రెస్ నాయకులు మాజీ కౌన్సిలర్స్ కాలువల జగన్ మోహన్ రావు , వేములపల్లి సంజీవ్, పూదరి ప్రభాకర్, ప్రభాకర్ నాయక్ , వంగపెల్లి రవీందర్ రావు , పల్లపు తిరుపతి పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!