రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు ఎంపికైన రివిలేషన్ పాఠశాల విద్యార్థి

రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు ఎంపికైన రివిలేషన్ పాఠశాల విద్యార్థి

మంచిర్యాల పట్టణంలోని రివిలేషన్ పాఠశాలలో జరిగిన జిల్లాస్థాయి యోగా పోటీలలో 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. రివిలేషన్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థి నాగుల శశివర్ధన్ జిల్లాస్థాయి యోగా పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచి రెండు బంగారు పతకాలు సాధించి రాష్ట్రస్థాయి యోగ పోటీలకు ఎంపికయ్యాడు. రివిలేషన్ గ్రూప్ ఆఫ్ స్కూల్ చైర్మన్ రాపోలు విష్ణు వర్ధన్ రావు, పాఠశాల ప్రిన్సిపాల్ మద్దెర్ల ప్రశాంత్ శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నాగుల శశివర్ధన్ రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి యోగా పోటీలకు సెలెక్ట్ కావాలని, మంచి గుర్తింపు తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కోచ్ అరుణ్, నాగుల శశివర్ధన్ తండ్రి నాగుల శ్రీనివాస్, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!