వందే భారత్ రైలు నిలుపుదలపై సంబరాలు

వందే భారత్ రైలు నిలుపుదలపై సంబరాలు

ఎంపీ గడ్డం వంశి ఘనతే – మాజీ కౌన్సిలర్ హరికృష్ణ
మంచిర్యాల: వందే భారత్ రైలు నిలుపుదలపై శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ లో ఎంపీ గడ్డం వంశి అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ సుధాముల్ల హరికృష్ణ మాట్లాడుతూ ఎంపీ పార్లమెంటులో రైల్ నిలుపుదల కోసం గళం విప్పి, మంచిర్యాల లో వ్యాపారులు పడుతున్న ఇబ్బందులు, సింగరేణి సంస్థ పరంగా మంచిర్యాలకు వస్తున్నా రెవెన్యూ గణాంకాలు వివరించి వందే భారత్ నిలుపుదల ఆవశ్యకతను రైల్వే మంత్రి వైష్ణవ్ వినిపించిన ఘనత ఎంపీకే దక్కుతుందన్నారు.గతంలో ఎంపీగా ఉన్న వివేక్ సైతం పలు ట్రైన్ల నిలుపుదలకు కారకులయ్యారని, అదే బాటలో ఎంపీ వంశీ పయనించడం మంచిర్యాల ప్రజలకు మరింత లాభం చేకూరనుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కె.వి ప్రతాప్, తాజ్ బాబా, చిట్టి పాషా, అంజత్ తదితరులు పాల్గొన్నారు.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!