అంబెడ్కర్ ఫంక్షన్ హాల్ ను సందర్శించిన బెల్లంపల్లి  ఎమ్మెల్యే వినోద్

అంబెడ్కర్ ఫంక్షన్ హాల్ ను సందర్శించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ,ఆగస్టు 27 (గోల్కొండ ప్రతినిధి):మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం లోని అంబెడ్కర్ ఫంక్షన్ హాల్ ను బుధవారం బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి సందర్శించారు . బెల్లంపల్లి పట్టణంలోని రెండు ఎకరాల స్థలంలో రెండు కోట్ల యాభై లక్షల రూపాయలతో గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో నిర్మాణ దశలోనే ఆగిపోయిన అంబేడ్కర్ ఫంక్షన్ హాల్ ని సందర్శించారు. దళిత సంఘాల నాయకులు బెల్లంపల్లి ఎమ్మెల్యే కు వినతి పత్రం అందజేశారు . ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే అంబెడ్కర్ ఫంక్షన్ హల్ మధ్యలోనే ఆగిపోవడం బాధాకరమని మంచిర్యాల జిల్లా కలెక్టర్ తో సింగరేణి జి. ఎం తో మాట్లాడి సాధ్యమైనంత వరకు తొందరలోనే అంబేద్కర్ ఫంక్షన్ హల్ నిర్మాణ పనులు పూర్తి చేయించి దళితుల కల సాకారం చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ దళిత సంఘాల ఐక్యవేదిక బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు కుంభాల రాజేష్,గౌరవ అధ్యక్షులు మల్లారపు చినరాజం, ప్రధాన కార్యదర్శి రత్నం ఐలయ్య,ఉపాధ్యక్షులు అంగూరి సుభాష్, కార్యదర్శులు గద్దల కుమార్, కాంపెల్లి సతీష్, గౌరవ సభ్యులు దుబాసి వెంకటస్వామి,ఎనగందుల నరేష్,తదితరులు పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!