ఆపరేషన్‌ సిందూర్‌లో ధైర్యసాహసాలు ప్రదర్శించిన జవాన్లకు సెల్యూట్‌….జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని మోదీ

ఆపరేషన్‌ సిందూర్‌లో ధైర్యసాహసాలు ప్రదర్శించిన జవాన్లకు సెల్యూట్‌….జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని మోదీ

ఢిల్లీ : దేశ 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దిల్లీలో ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. మరి కాసేపట్లో ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు . అంతకుముందు త్రివిధ దళాల నుంచి ప్రధాని గౌరవ వందనం స్వీకరించారు. రాజ్‌ఘాట్‌ వద్ద నివాళి అర్పించారు.ఆపరేషన్‌ సిందూర్‌లో ధైర్యసాహసాలు ప్రదర్శించిన జవాన్లకు సెల్యూట్‌.
మన వీర జవాన్లు శత్రువును ఊహించని రీతిలో దెబ్బకొట్టారు.పహల్గామ్‌లో మతం అడిగి మరీ పర్యాటకులను ఉగ్రవాదులు చంపారు.భార్య, కన్నబిడ్డల కళ్లెదుటే దారుణంగా కాల్చి చంపారు.పహల్గామ్‌ దాడితో యావత్‌ దేశం ఆక్రోశంతో రగిలిపోయింది.ఆ ఆక్రోశానికి సమాధానంగానే ఆపరేషన్‌ సిందూర్‌.భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం.యుద్ధతంత్రాలు, వ్యూహాలు పూర్తిగా మన జవాన్లే తయారుచేసుకున్నారు.ఆపరేషన్‌ సిందూర్‌తో మన సత్తా చాటాం. ఆపరేషన్‌ సిందూర్‌తో పాక్‌కు నిద్ర పట్టకుండా చేశాం.ఉగ్రమూకలకు మన సైన్యం బుద్ధి చెప్పింది. ఇకపై బ్లాక్‌మెయిల్‌ చేసేవారిని ఉపేక్షించేది లేదు అని ప్రధాని తన ప్రసంగంలో పేర్కొన్నారు.ఈ వేడుక కోసం ఎర్రకోట పరిసరాల్లో 11 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. 3 వేల మంది ట్రాఫిక్‌ పోలీసులు విధుల్లో ఉన్నారు. మహానగరం యావత్తు కెమెరా నిఘాను పటిష్ఠం చేశారు. ‘నయా భారత్‌’ ఇతివృత్తంతో ఈ స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!