
ఆటో బోల్తా విద్యార్ధి మృతి …
కరీంనగర్ ఆగస్టు 14 (గోల్కొండ ప్రతినిధి ): కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామంలో ప్రైవేట్ స్కూల్ విద్యార్థుల ఆటో బోల్తా పడింది. ఈ సంఘటనలో మన్నెంపల్లి కి చెందిన నాంపల్లి హర్షవర్ధన్ (10 ) మృతి చెందాడు.పాఠశాల ముగించుకొని ఆటోలో ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరింగింది.ఈ ప్రమాదంలో మరి కొంత మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయాలైన విద్యార్థులను కరీంనగర్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.విద్యార్ధి మృతి తో మన్నెంపల్లి లో విషాద ఛాయలు అలుముకున్నాయి. 
TAGS Hot News


