
సూచీలకు స్వల్ప లాభాలు..
ముంబాయి..ఆగస్టు 14 (గోల్కొండ )
గత వారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు ప్రస్తుతం కోలుకుంటున్నాయి. బుధవారం భారీ లాభాలను ఆర్జించిన సూచీలు గురువారం స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ మాత్రం నష్టాలతోనే రోజును ముగించింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ మాత్రం నష్టాలతోనే రోజును ముగించింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు విషయంలో గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉందన్న వార్తలు వస్తుండడం కాస్త సానుకాలాంశంగా కనిపిస్తోంది. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ లాభాలతో రోజును ముగించాయి.
బుధవారం ముగింపు (80, 539)తో పోల్చుకుంటే గురువారంవారం ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన సెన్సెక్స్ రోజులో చాలా సమయం లాభాల్లోనే కదలాడింది. గురువారం సెన్సెక్స్ 80, 489-80,751 శ్రేణి మధ్యలో కదలాడింది. చివరకు సెన్సెక్స్ 57 పాయింట్ల స్వల్ప లాభంతో 80, 597 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 11.95 పాయింట్ల లాభంతో 24, 631 వద్ద స్థిరపడింది.


