సీఎంపై ప్రశంసలు.. ఎమ్మెల్యేను బహిష్కరించిన పార్టీ…ఎస్ పి

సీఎంపై ప్రశంసలు.. ఎమ్మెల్యేను బహిష్కరించిన పార్టీ…ఎస్ పి

లక్నో, ఆగస్ట్ 14 (గోల్కొండ ): ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో గురువారం చర్చ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సమాజ వాదీ ఎమ్మెల్యే పూజా పాల్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీసుకుంటున్న చర్యల కారణంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు మెరుగుపడ్డాయన్నారు. అలాగే నేరాల సంఖ్యను తగ్గించేందుకు ఆయన చేపట్టిన విధానాలు సత్ ఫలితాలు ఇస్తున్నాయని.. అందులోభాగంగా నేరాలు దాదాపుగా తగ్గిపోయాయంటూ ఆమె ప్రశంసించారు. అందులోభాగంగా సీఎంకు పూజా పాల్ ధన్యవాదాలు సైతం తెలిపారు. సీఎం యోగికి ధన్యవాదాలు చెప్పిన కొన్ని గంటలకే పూజా పాల్‌ను సమాజ వాదీ పార్టీ నుంచి బహిష్కరించరు.ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను ప్రశంసించిన కారణంగా సమాజ వాదీ ఎమ్మెల్యే పూజా పాల్‌‌ను ఆ పార్టీ నుంచి ఆగ్ర నాయకత్వం బహిష్కరించింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడంతోపాటు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందున పూజా పాల్‌ను పార్టీ నుంచి బహిష్కరించినట్లు సమాజ వాదీ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు గురువారం ఆ పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!